అమెరికాను ఇరాన్ కొట్టింది మామూలు దెబ్బ కాదు!

  • ఇరాన్ దాడులతో అమెరికా సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం
  • మరమ్మతులకే బిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా
  • నష్టం వివరాలు చెప్పడం లేదని పెంటగాన్‌పై రిపబ్లికన్ల ఆగ్రహం
  • అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించిన ఇరాన్ పాత ఫైటర్ జెట్
  • సౌదీ అరేబియాలో అమెరికా నిఘా విమానం ధ్వంసం
అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ జరిపిన దాడుల వల్ల మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అమెరికా అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ నష్టం విలువ బిలియన్ల డాలర్లలో ఉంటుందని, మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఎన్‌బీసీ న్యూస్ తన కథనంలో వెల్లడించింది.

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దళాలు ఏడు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో కమాండ్ సెంటర్లు, విమాన హ్యాంగర్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, రన్‌వేలు, రాడార్లతో పాటు కొన్ని విమానాలు కూడా దెబ్బతిన్నాయి. అమెరికాకు చెందిన అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను ఛేదించుకుని, ఇరాన్‌కు చెందిన పాతతరం ఎఫ్-5 ఫైటర్‌ జెట్‌ కూడా దాడి చేయగలగడం అమెరికా సైనిక వర్గాలను ఆశ్చర్యపరిచింది. సౌదీ అరేబియాలోని ఒక ఎయిర్ బేస్ పై దాడిలో అమెరికా నిఘా విమానం (అవాక్స్) ధ్వంసమైన చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

అయితే, జరిగిన నష్టంపై పూర్తి వివరాలు వెల్లడించడానికి అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) నిరాకరిస్తోంది. ఈ వైఖరిపై రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారాల తరబడి అడుగుతున్నా సమాచారం ఇవ్వడం లేదని, రికార్డు స్థాయి బడ్జెట్ కోరుతున్న సమయంలో పెంటగాన్ ఇలా వ్యవహరించడం సరికాదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికే యుద్ధం కోసం ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్‌ను 200 బిలియన్ డాలర్లు కోరింది. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే అమెరికా 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

Iran
US military
Middle East
American military bases
Iran attacks
Pentagon
Saudi Arabia
Trump
Military damage

More Telugu News